కరోనా ఎఫెక్ట్: మారుతీ సుజుకీ హిస్టరీలో ఫస్ట్ టైమ్ జీరో సేల్స్

ఒక్క సేల్ లేకుండా ముగిసిన ఏప్రిల్ నెల
న్యూఢిల్లీ: ఆటో మొబైల్ దిగ్గజం మారుతీ సుజీకీ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఓ నెలలో ఎటువంటి సేల్స్ లేకుండా ముగించింది. లాక్ డౌన్ కారణంగా దేశంలో అత్యధికంగా కార్లను తయారు చేసే ఈ కంపెనీ మొత్తం ప్రొడక్షన్ ను ఆపేసింది. లాక్ డౌన్ వల్ల ఏప్రిల్ లో మారుతీ ఒక్క కారునూ అమ్మలేదు. దీంతో గత నెల లెక్క చూయించడానికి మారుతీకి అమ్మకాల పరంగా ఏమీ లేదు. మిగిలిన కంపెనీల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని అనలిస్టులు చెప్తున్నారు. గత వారం మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఆర్.సి.భార్గవ ఒక మీడియా చానల్ కు ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఏప్రిల్ నెల ఇంతకుముందెప్పుడూ చూడనటువంటిదిగా ఉండబోతోంది. కొన్ని అసాధారణ విషయాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, ఓ ఏడాదిలో ఒక నెలలో ఆటోమొబైల్స్ లో జీర్ సేల్స్ నమోదవడం ఇంతవరకు జరగలేదు. ఏప్రిల్ అలాంటి నెలే. కార్లను రూపొందించేందకు అవసరమైన అన్ని కాంపోనెంట్స్ (భాగాలు) అందుబాటులో ఉండే దాకా వాటిని తయారీ చేయలేం’ అని చెప్పారు. మారుతీ సంస్థ ప్రతి నెల యావరేజ్ గా 1.50 లక్షల కార్లను తయారు చేస్తుంది. బయటి దేశాలకు కూడా ఈ కార్లను ఎగుమతి చేస్తుంది.

Latest Updates