మార్వాడీ జిలేబీ

నోరూరించే జిలేబీకి ఫేమస్‌ నిజామాబాద్‌.దాదాపు అరవై ఏళ్లుగా ఒక కుటుంబం జిలేబీ తయారీని జీవనాధారంగా చేసుకుంది. నలభై ఏళ్ల క్రితం రాజస్థా న్‌ నుంచి నిజామాబాద్‌కు వలస వచ్చిన కిషల్‌ లాల్‌ ముందాడ.. పట్టణంలోని కుమార్‌ గల్లీలో చిన్న జిలేబీ దుకాణం ప్రారంభించాడు. స్థా నికుల నుంచి మంచి అదరణ లభించింది. 2002లో కిషన్‌ లాల్‌ మృతి చెందడంతో ఆయన కుమారులు హరిప్రసాద్‌, అనిల్‌కుమార్‌ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.రోజుకు 60 కిలోల విక్రయాలు
‘‘జిలేబీ తయారీలో వాడే ముడి సరుకు పూర్తిగా నాణ్యమైనవి వాడడం మా ప్రత్యేకత. పెళ్లిళ్లు, పేరంటాలు, ఇతర శుభకార్యాలకు భారీగా ఆరర్లు వస్తుంటాయి. గణేశ్‌ ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాల్లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయి.అంతేకాకుండా ప్రతిరోజు దాదాపు అరవై కిలోల జిలేబీ విక్రయాలు చేస్తున్నాం. జిలేబీతో పాటు సాయంత్రం వేళల్లో మిర్చి, పునుగులు కూడా అమ్ముతుంటాం . దుబాయ్ లో ఉంటు న్న స్థా నికులు మేము తయారు చేసే జిలేబీలను తీసుకెళ్తుంటార’ని చెప్ పారు హరిప్రసాద్‌, అనిల్‌కుమార్‌.

Latest Updates