రాష్ట్రంలో మాస్కుల వాడ‌కం త‌ప్ప‌నిస‌రి

రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు వాడాలంటూ శుక్ర‌వారం తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇళ్ల నుంచి ఎవ్వ‌రు బ‌య‌టికొచ్చినా త‌ప్ప‌కుండా మాస్కులు ధ‌రించాల‌ని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదని అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ల‌క్ష‌ణాలు లేకున్నా క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. పాజిటివ్ లు వ‌స్తున్న ఘ‌ట‌న‌ల దృష్ట్రా కూడా ఇవి త‌ప్ప‌నిస‌రి అని పేర్కొంది. ప్ర‌తిఒక్క‌రూ మాస్కులు త‌ప్ప‌కుండా పెట్టుకోవాల‌ని ఇటీవ‌లే కేంద్రం కూడా చెప్పిన విష‌యం తెలిసిందే.

Latest Updates