అప్పుడు గంజాయి.. ఇప్పుడు శానిటైజర్లు : ఉచితంగా పంపిణీ చేసిన మ్యూజిక్ డైరెక్టర్

కరోనా వైరస్ నుంచి ప్రజల్ని ఆదుకునేందుకు ఓ మ్యూజిక్ డైరెక్టర్ టాయిలెట్ రూల్స్, శానిటైజర్లను పంపిణీ చేశాడు. ఇంగ్లాండ్ మాంచెస్టర్ కు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఓట్లా..తన రేంజ్ రోవర్ నిండా శానిటైజర్లు, టాయిలెట్ పేపర్లను నింపుకొని పబ్లిక్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.

వైస్ మీడియా కథనం ప్రకారం మాంచెస్టర్ లో పేరు ప్రఖ్యాతలున్న డైరెక్టర్ ఓట్లా అక్కడి స్థానికులు కరోనా వైరస్  సోకకుండా జాగ్రత్తపడేలా  నిత్యావసరాలను పంపిణీ చేయడం హాట్ టాపిగ్గా మారింది. పేదలకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడని, అదే సమయంలో  విమర్శలు ఎదుర్కొంటున్నాడని అంటున్నారు.

గతంలో ఇలాగే స్థానికుల కోసం ఉచితంగా గంజాయి మొక్కల్ని సరఫరా చేయడం వివాదాస్పదమైంది. ఇలా గంజాయిని ఎందుకు పంపిణీ చేయాల్సి వస్తుందని ప్రశ్నిస్తే..నాకు ఈ అవసరం ఉందని తన ఇన్ స్ట్రాగ్రాం లో మెసేజ్ పెడితే చేస్తానని, అలా అడిగారు కాబట్టే తాను గంజాయిని పంపిణీ చేసినట్లు చెప్పాడు.

గంజాయిని సరఫరా చేసిన ఇప్పుడు కష్టకాలంలో ఉన్న స్థానికుల్ని ఆదుకుంటున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Latest Updates