పాఠశాల విద్యార్థులకు మాస్కులు,శానిటైజర్లు

ఫిబ్రవరి 1వ తేదీ నుండి తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా  మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ విద్యార్థులకు మాస్కులు ,శానిటైజర్లు అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి 55 వేల మాస్క్‌లు, శానిటైజర్‌లను జిల్లా విద్యాధికారి రోహిణి, ఇంటర్‌ బోర్డ్‌ జిల్లా విద్యాధికారి జయప్రదలకు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూళ్లను ఓపెన్‌ చేయాలని కోరారు. స్కూల్స్‌లో కరెంటు సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 55 వేల మంది విద్యార్థులకు రెండు మాస్కులు, సానిటైజర్లు అందజేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తలసాని.

Latest Updates