జాబ్ లేనోళ్లకు ఆసరగా మారిన మాస్క్

పెరుగుతున్న చేనేత, హ్యాండ్ మేడ్, బ్రాండెడ్ మాస్క్‌‌ల అమ్మకాలు
ఒక్కో మాస్క్ ధర రూ.10 నుంచి వేలల్లో

హైదరాబాద్, వెలుగు: మాస్క్.. ఒకప్పుడు డాక్టర్లు వేసుకునేటోళ్లు. ఇప్పుడు ప్రపంచమంతా వేసుకుంటోంది. మాస్క్.. ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు రెడీ చేసేవి. ఇప్పుడు మన పక్కింటిలోనే తయారు చేస్తున్నారు. కరోనా తెచ్చిన మార్పు ఇది. ఇప్పుడు మాస్క్ లు జీవితంలో ఒక భాగమైపోయాయి. బతకాలంటే ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో.. మాస్క్ కూడా అంతే ముఖ్యం అయింది. బయటికి వస్తే కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందే. దీంతో జనం అవసరం కాస్తా.. కంపెనీలకు వ్యాపారం అయింది. లాక్ డౌన్ లో ఉపాధి, ఉద్యోగం కోల్పోయిన వారికి బతువుదెరువు అయింది.

బ్రాండెడ్ మాస్క్ లు
నిన్నమొన్నటి దాకా లోకల్ బ్రాండ్ లలోనే మాస్కులు దొరికేవి. మెడికల్ షాపుల్లో దొరికే సర్జికల్, ఎన్95 మాస్క్ లకు మొదట్లో డిమాండ్ పెరిగి పోయి స్టాక్ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జనాలకు మాస్క్ ల అవసరాన్ని గుర్తించిన పలు క్లాత్ బ్రాండ్ లు, డిజైనర్ సంస్థలు
తమ బ్రాండ్ లలో మాస్క్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని చేనేత కళాకారులు ఓకల్ ఫర్ లోకల్ పేరుతో నేత మాస్క్ లను తయారుచేసి అమ్ముతున్నారు. దీంతో ఎన్నోరకాల మాస్క్ లు మార్కెట్ లో కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిని, ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మందికి ఈ మాస్క్ లే ఉపాధిగా మారుతున్నాయి. చౌరస్తాల దగ్గర, ఫుట్ పాత్ ల మీద స్టాండ్ లు, తోపుడు బండ్లమీద క్లాత్ మాస్క్ లు పెట్టి అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మరికొంత మంది ఆన్ లైన్ లో మాస్క్ ల బిజినెస్ చేస్తున్నారు. మాస్క్ లు రూ.10 నుంచి వెయ్యి, 1,500ల వరకు ఉంటున్నాయి. మరోవైపు మాల్స్ లోని ఏ క్లాత్ స్టోర్ కి వెళ్లినా అప్పెరల్స్ తో పాటు మాస్క్ లు ఉంటున్నాయి. జనాలు బట్టల కంటే మాస్క్ లనే ఎక్కువగా కొంటుండటంతో బడా కంపెనీలు కూడా తమ బ్రాండ్ పేరుతో మాస్క్ లను తయారు చేసి అమ్ముతున్నాయి. ఇందులో వైల్డ్ క్రాఫ్ట్, డబ్ల్యూ, పుమా, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటెన్, మై నైకా, మింత్రా, పీసేఫ్, ఫియోనిక్స్, అమెజాన్, వాల్ మార్, ట్నైకి, టామి హిల్ ఫిగర్, అడిడాస్ కంపెనీలు ఇప్పుడు తమ ప్రొడక్స్ ట్లలో మాస్క్ లను కూడా చేర్చేసాయి.

ఉపాధిగా మారింది
నాకు మొబైల్ రిపేర్ షాపు ఉండేది. లాక్ డౌన్ వల్ల షాపుని రెండు నెలలు క్లోజ్ చేశా. జనాలు ఎక్కువగా మాస్క్ లు కొంటున్నారని తెలిసి.. మాస్క్ ల వ్యాపారం మొదలు పెట్టా . రోడ్ సైడ్ స్టాండ్ పెట్టి అమ్ముతున్నా. నా స్నేహితుల ద్వారా హాండ్ మేడ్ మాస్క్ లు తీసుకుని సేల్
చేస్తున్నా. ఇప్పుడిదే ఉపాధిగా మారింది.
– అహ్మద్, మాస్క్ వ్యాపారి, ఫిలింనగర్

బట్టలు కొంటలే
ప్రతి నెల 4 వేల మాస్క్ లు అమ్ముతున్నాం. ఇప్పుడు ఈ బిజినెస్ మాత్రమే జరుగుతుంది. ఎవరూ క్లాత్స్ కొనడం లేదు. అందరూ మాస్క్ లనే కొంటున్నారు. – నాగరాజు, అసిస్టెంట్ స్టోర్ మేనేజర్, వైల్డ్ క్రాఫ్ట్ స్టోర్, ఇనార్బిట్ మాల్

కంఫర్ట్ గా ఉంటుంది
లాక్ డౌన్ మొదట్లో డిస్పోజబుల్ మాస్క్ లు యూజ్ చేశా. బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్క్ కంపల్సరి అవడంతో వైల్డ్ క్రాఫ్ట్ ఎన్95 ప్లస్ తీసుకున్నాను. అది చాలా కంఫర్ట్ గా ఉంది. డైలీ అదే యూజ్ చేస్తున్నా. వాషబుల్ కావడంతో మళ్ళీ మళ్ళీ కొనాల్సిన పని లేదు.
– విక్కీ, స్టూడెంట్, సైనిక్ పురి

For More News..

మళ్లీ సిటీ బాటపట్టిన వలస కూలీలు

Latest Updates