మాస్క్ లేకుండా తిరిగేవారిని గుర్తించేందుకు కొత్త టెక్నాలజీ

క‌రోనా నేప‌థ్యంలో లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా రోడ్లపై మాస్కులు లేకుండా తిరిగేవారిని గుర్తించటానికి తెలంగాణ పోలీస్ శాఖ ఓ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనుంది. దేశంలోనే ప్రప్రథమంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, CCTV నిఘా కెమెరాల యొక్క కంప్యూటర్ విజన్ ను (#DeepLearningTechnique) లోతుగా విశ్లేషించడం అనే కృత్రిమ మేధో పద్దతి (#AI)ద్వారా ఫేస్ మాస్క్ ధరించని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకునే దిశగా… తెలంగాణ స్టేట్ పోలీస్ అడుగులు వేస్తోంది. త్వరలో హైదరాబాద్-రాచకొండ-సైబరాబాద్ కమిషనరేట్లో ఈ టెక్నాలజీని అమలు చేయనుంది.

క‌రోనా వైర‌స్ సోక‌కుండా ముందు జాగ్ర‌త్త కోసం ప్రభుత్వం మా‌స్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయినా చాలా మంది ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా.. మాస్క్‌లు ధరించకుండా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. మాస్క్‌ లేకుండా బయటకి వస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తోంది. ఎన్నిసార్లు మాస్కులు లేకుండా తిరిగితే అన్ని సార్లు రూ. 1000 జరిమానా చెల్లించాల్సిందేనని అంటున్నారు పోలీసులు .

Latest Updates