మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాది: ఐక్యరాజ్యసమితి

ఉగ్రవాద నిర్మూలనకు భారత్ తీసుకుంటున్న చర్యల్లో మరో ముందడుగు పడింది. జైషే మహ్మద్ చీఫ్.. మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. ఈ నిర్ణయంతో మసూద్ అజార్ ఆర్థిక మూలాలపై దెబ్బ పడనుంది. అతని ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో భారత్ గొప్ప విజయం సాధించినట్లైంది. మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి ఇన్ని రోజులు అభ్యంతరం చెబుతూ వచ్చిన చైనా.. ఎట్టకేలకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. తన అభ్యంతరాలను ఉపసంహరించుకుంది. భారత్ తో పాటు.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఒత్తిడితోనే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

Latest Updates