హోలీ వేడుకల్లో మసూద్‌ దిష్టిబొమ్మ దహనం

ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన యువకులు హోలీ సందర్భంగా పుల్వామా ఉగ్ర దాడికి కారణమైన మసూద్‌ అజహర్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో పాటు యువతరాన్నిపట్టి పీడుస్తున్న పాపులర్‌ మొబైల్  గేమ్‌ పబ్‌జీ  దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. సియాన్ కోలివాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులు కలిసి ఉగ్రభూతం మసూద్ అజహర్ తోపాటు పిల్లల ప్రాణాలు తీస్తున్న పబ్ జీ మొబైల్ గేమ్ దిష్టిబొమ్మలను హోలీ పండుగ వేళ దహనం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.

 

Latest Updates