డబ్బులిచ్చి ఇంటర్ ఎగ్జామ్ ​లో మాస్ కాపీయింగ్​

  •                టోలిచౌకి న్యూ మదీనా కాలేజీలో బాగోతం ​
  •                 టాస్క్ ఫోర్స్ అదుపులో 8 మంది స్టూడెంట్స్, స్టాఫ్​

ఇంటర్‍ ఎగ్జామ్స్​లో  మంగళవారం హైదరాబాద్​లోని ఓ కాలేజీలో మాస్​కాపీయింగ్​ జరిగింది. టోలిచౌకిలోని న్యూ మదీనా జూనియర్‍ ఇంటర్‍ ప్రైవేట్‍ కాలేజీలో కెమిస్ట్రీ పరీక్షలు రాస్తున్న స్టూడెంట్స్​దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని కొంతమంది ఈ వ్యవహారం నడిపించారు. నార్త్ జోన్‍ టాస్క్ ఫోర్స్​ ఇంటర్‍ బోర్డు అధికారులను అప్రమత్తం చేయగా దాడులు చేసి..కాపీయింగ్​కు సహకరిస్తున్న కాలేజీ స్టాఫ్​ను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఎగ్జామ్‍ సెంటర్‍ చీఫ్‍ సూపరింటెంటెండ్‍గా వ్యవహరిస్తున్న కాలేజీ కరస్పాడెంట్‍నిషోయబ్‍ తన్వీర్‍(29)తోపాటు స్టాఫ్‍ షాభా, షహీదా షరీన్‍, సయ్యద్‍ ఖలీముద్దీన్‍లను అదుపులోకి తీసుకున్నామని, డీఐఈఓ ఫిర్యాదు మేరకు వారిపై గోల్కొండ పీఎస్‍లో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  ఇంత జరుగుతున్నా డిపార్టుమెంటల్‍ ఆఫీసర్‍  పట్టించుకోకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అలాగే కాపీ కొడుతున్న 8 మంది స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ కాలేజీలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. వీరిపై మాల్‍ ప్రాక్టిస్‍ కేసులు పెట్టినట్టు ఇంటర్‍ బోర్డు అధికారులు తెలిపారు. ఒక్క కెమిస్ట్రీ ఎగ్జామ్​తోనే ఇది ముడి పడి ఉందా లేక గతంలో జరిగిన పరీక్షల్లోనూ ఇలాగే జరిగిందా అన్న కోణంలో విచారిస్తున్నారు.

కాపీ జరిగింది ఇలా..

న్యూ మదీనా జూనియర్‍ కాలేజీ కరస్పాండెంట్‍ షోయబ్‍ తన్వీర్‍ ముందుగానే స్టూడెంట్స్ తో ఒప్పందం చేసుకున్నారని అధికారులు చెప్పారు. ఎగ్జామ్‍ హాల్లో స్టూడెంట్స్ కు ఇన్విజిలేటర్‍ ఇచ్చిన ఆన్సర్ షీట్లు తీసుకొని, స్టాఫ్​ వేరే గదిలో కూర్చొని రాసిన ఆన్సర్ షీట్లను ఇచ్చారన్నారు. వీరి వ్యవహార శైలిపై ఇతర స్టూడెంట్స్ కి అనుమానం రావడంతో టాస్క్ ఫోర్స్, ఇంటర్‍ అధికారులకు చేరింది.

Latest Updates