మసాజ్ చేసేందుకు వచ్చి ఒళ్లు,ఇల్లు గుల్ల చేశారు

massage-girls-robbed-a-mans-house

బాడీ మసాజ్ కోసం అమ్మాయిలను బుక్ చేసుకుంటే… వచ్చిన వాళ్లు ఒళ్లు హూనమయ్యేలా చితకబాది… అందినకాడికి దోచుకెళ్లారు. మసాజ్ తో సేదతీరుదామనుకుంటే.. ఒంటి నొప్పులతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు ఓ వ్యక్తి. ఈ ఘటన అమెరికా లో జరిగింది.

అమెరికాలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు ఆన్‌లైన్ లో మసాజ్ గర్ల్స్ ప్రకటన చూశాడు. ఫోన్ నెంబర్ చూసి ఆ యువకుడు బాడీ మసాజ్ చేయించుకునేందుకు వాట్సప్ చేశాడు. వాట్సప్ మెసేజ్ అందుకున్న ఈ మసాజ్ పార్లర్లోని ఓ మహిళ ఆ యువకుడికి ఫోన్ చేసి ఎంత ఖర్చు అవుతుందో చెప్పింది. మసాజ్ పార్లర్ ఆకర్షణీయమైన ఆఫర్లు చెప్పడంతో… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది మందిని తన ఫ్లాట్‌కు పంపమని బుక్ చేసుకున్నాడు.

ఓకే చెప్పిన కొద్ది సేపటికే వాళ్లు ఫ్లాట్ దగ్గరకు చేరుకున్నారు. కాలింగ్ బెల్ నొక్కారు. ఆ యువకుడు డోర్ తెరవగానే ఎనిమిది మంది బలిష్టమైన ఆఫ్రికా మహిళలు ప్రత్యక్షమయ్యారు. ఆ ఎనిమిది మంది ఆఫ్రికన్ మహిళలు ఆ వ్యక్తిని లోపలకు లాక్కుని వెళ్లారు. ఆ తర్వాత అతడిని చితకబాది ఓ గదిలో నిర్భందించారు. ఒళ్లు, ఇల్లు గుల్ల చేశారు. దాదాపు రూ. 11 లక్షల దాకా కాజేశారు. అలాగే ఇంట్లోని సామాన్లతో సహా విలువైన వస్తువులను ప్యాక్ చేసుకొని తీస్కెళ్లారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Latest Updates