ఇరాన్‌ అణు శాస్త్రవేత్త మొసిన్‌ ఫక్రజాదే దారుణ హత్య

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ట్రెహాన్‌కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొసిన్‌ ఫక్రజాదే దారుణ హత్యకు గురయ్యారు. న‌గ‌ర శివారు ప్రాంత‌మైన అబ్‌సార్డ్ దగ్గర వాహ‌నంలో వెళ్తున్న ఫ‌క్రిజాదేపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

ఇరాన్ ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన రీస‌ర్చ్ అండ్ ఇన్నోవేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ అధిప‌తిగా ఫ‌క్రిజాదే ప‌నిచేశారు. అణు శాస్త్ర‌వేత్త హ‌త్య‌లో ఇజ్రాయిల్ పాత్ర ఉన్న‌ట్లు ఇరాన్ ఆరోపించింది. ఇరాన్‌కు చెందిన న్యూక్లియ‌ర్ శాస్త్ర‌వేత్త‌ల‌ను వ‌రుస‌గా గ‌త ప‌దేళ్ల నుంచి హ‌త‌మారుస్తున్న‌ట్లు ఇజ్రాయిల్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

సీనియ‌న్ న్యూక్లియ‌ర్ సైంటిస్ట్ మృతి ప‌ట్ల ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఆ హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఇరాన్ ప్ర‌భుత్వం తేల్చిచెప్పింది. ఇరాన్‌లో కోవ‌ర్ట్ న్యూక్లియ‌ర్ ప్రోగ్రామ్‌లో ఫ‌క్రిజాదేకు ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు తెలిపాయి. తాము చేప‌డుతున్న అణు కార్య‌క్ర‌మం శాంతి కోస‌మే అంటూ ఇరాన్ ప్ర‌క‌టించింది.  అయితే…అణు శాస్త్ర‌వేత్త  హ‌త్య‌పై ఇంత వ‌ర‌కు ఇజ్రాయిల్ స్పందించ‌లేదు.

Latest Updates