ఫ్యాన్సీ నంబర్లకు మస్త్​ ​క్రేజ్

ఫ్యాన్సీ నంబర్లకు మస్త్​ ​క్రేజ్
  • వెహికల్ రేటులో 30-40 శాతం వరకు ఖర్చు
  • గ్రేటర్ కు చెందినవారే ఎక్కువగా కొనుగోలు
  • ఇటీవల 9999 నంబర్‌కు రూ. 10 లక్షలు
  • ప్రతి ఏడాది ఆర్టీఏకు రూ. కోట్లలో ఆదాయం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : వెహికల్​ ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారుల్లో ఇంట్రెస్ట్ ​ పెరుగుతోంది. కాస్ట్లీ కారు నుంచి స్పోర్ట్ బైక్​వరకు లక్కీ నంబర్​ ఉండేలా చూసుకుంటున్నారు.  కొందరు ప్రెస్టేజీ, క్రేజీ కోసమైతే, మరికొందరు న్యూమరాలజీ ప్రకారం కొంటున్నారు.  వెహికల్ రేటులో 30–40శాతం వరకు ఖర్చు చేస్తుండడం విశేషం. ఒకప్పుడు ఫ్యాన్సీ నంబర్లు వీఐపీలు, బిజినెస్​మన్లు, ఇండస్ట్రియలిస్ట్​లు, సెలబ్రిటీల వెహికల్స్​కే ఉండేవి. కొన్నాళ్ల కిందట అందుబాటులోకి వచ్చిన ఆన్ లైన్ సిస్టమ్ ​ద్వారా కామన్​ పీపుల్​కూడా ఫ్యాన్సీ నంబర్ల కోసం బిడ్డింగ్ పోటీలో ఉంటున్నారు. ఇలా క్రమంగా పోటీ కూడా పెరుగుతోంది . ఒక్కో నంబర్ ​కోసం  రూ. వేల నుంచి లక్షలు చెల్లిస్తున్నారు.  గ్రేటర్ పరిధిలోనే ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో జిల్లాల్లో కూడా ఇంట్రెస్ట్ ​చూపిస్తున్నారని ఆర్టీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫ్యాన్సీ నంబర్లు ఎక్కువగా గ్రేటర్ కు చెందిన వెహికల్స్​కే ఉండగా, ఇందులో పొలిటికల్, సెలబ్రిటీలు ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ బిడ్డింగ్ సేవలు అందుబాటులో ఉండగా, ఇందులో  రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ వాహనాదారులే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకు హై ఎండ్ కార్లకు మాత్రమే ఫ్యాన్సీ నంబర్​ తీసుకోగా, ఇటీవల కాలంలో మిడ్ రేంజ్ కార్లకు కూడా తీసుకుంటున్నారు. 
రూ. లక్షలు చెల్లిస్తూ..
ఫ్యాన్సీ నంబర్ల వేలంలో 9999 ఎవర్ గ్రీన్​గా నిలుస్తోంది. దీని కోసం రూ. లక్షలు చెల్లిస్తుంటారు. ఆన్ లైన్ వేలం షురూ అయినప్పటి నుంచి వేర్వేరు సిరీస్​లకు లక్షలు పోసి సొంతం చేసుకుంటున్నారు. ఈనెల 17న జరిగిన ఈ – బిడ్డింగ్​లో హై ఎండ్ వోల్వో కారు కోసం ఓ వాహనదారుడు  TS09FQ9999 నంబర్​ను రూ. 10.70 లక్షలకు దక్కించుకున్నారు. బిడ్డింగ్ తర్వాత 15 రోజుల్లోగా పేమెంట్ చేయకపోతే రిజర్వ్ చేసుకున్న ఫ్యాన్సీ నంబర్​ఇన్ వాలిడ్ అవుతుంది. ఆన్ లైన్ సిస్టమ్​అమలుతో సాధారణ జనాలు కూడా ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలల్లో చెల్లిస్తున్నారు.  డిమాండ్ మాత్రం 9999 కే ఉంది. 2016-–17 లో 9999 సిరీస్ రూ. 10లక్షలు, 2019–20లో అదే 9999 సిరీస్ ఏకంగా రూ. 11 లక్షలు పలికింది. హైదరాబాద్ ఆర్టీఏ చరిత్రలోనే ఇదే అధికంగా వచ్చిన బిడ్డింగ్ కావడం విశేషం. ఆ సిరీస్ తర్వాత ఎక్కువగా సీక్వెల్స్, రిపిటేడ్ నంబర్లు, సింగిల్ డిజిట్ నంబర్ల కోసం పోటీ ఉంది. 6666 నంబర్​కోసం ఎక్కువగా ఇంట్రస్ట్​ చూపుతారని ఆర్టీఏ అధికారులు తెలిపారు. 

గ్రేటర్​ నుంచే ఎక్కువగా
ఫ్యాన్సీ నంబర్ల కింద ఆర్టీఏ డిపార్ట్​మెంట్​కు ప్రతి ఏడాది కోట్లలో ఇన్​కమ్​ వస్తుంది.  ఇందులో ఎక్కువగా గ్రేటర్ నుంచే ఉం టుంది.  ఇటీవల కాలంలో లక్షల విలువైన కార్లతోపాటు స్పోర్ట్స్ బైకు ఓనర్లు కూడా ఫ్యాన్సీ నంబర్ల కోసం క్యూ కడుతుండడం విశేషం. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలోనే ఫ్యాన్సీ నంబర్లు ఎక్కువగా రిజిస్టర్ అవుతు న్నాయి.  ఏటా గ్రేటర్​లోని ఆర్టీఏ ఆఫీసు ల నుంచి రూ. 8–12 కోట్ల ఇన్​కమ్​ ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే సమకూరుతుంది. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సిస్టమ్​ వచ్చాక..
గతంలో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు ఎప్పుడూ వివాదంగానే ఉండేది. రాజకీయ, అధికారుల రికమెండేషన్లు ఉంటే తప్ప దొరికే పరిస్థితి ఉండేది. తక్కువ ధరలకే కావాల్సిన వారికి ఫ్యాన్సీ నంబర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆన్ లైన్ సిస్టమ్​ వచ్చాక  రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ ఆఫీసుల నుంచి ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పెరిగింది. అయితే బ్రోకర్ల బెడద లేకుండా ఉండాలంటే ఫ్యాన్సీ నంబర్ల  కోసం ఆన్ లైన్​లో అప్లయ్ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని వాహనదారులు అంటున్నారు. ఆర్టీఏ మరింత అవగాహన కల్పిస్తే ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు.
మెరిసిన మోడల్స్
ర్యాంప్ వాక్ చేసి మిస్ యూనివర్స్ ఇండియా -20 ఫైనలిస్ట్ అర్చనా రవి, మోడల్స్ అదరహో అనిపించారు. మంగళవారం బంజారాహిల్స్  తాజ్ డెక్కన్​లో  ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ కర్టెన్ రైజర్, పోస్టర్ లాంచింగ్​ ప్రోగ్రామ్​ జరిగింది. సిటీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ శాలికా క్రియేటివ్ కలెక్షన్స్ ని మోడల్స్ తో షోకేజ్ చేయించారు. వచ్చే నెల 8  నుంచి మూడు రోజులపాటు తాజ్ డెక్కన్​లో ఎగ్జిబిషన్ జరుగనుంది.  సెకండ్ ఎడిషన్​లో ఎక్స్ క్లూజివ్ వెడ్డింగ్, సమ్మర్ కలెక్షన్​ని అందుబాటులోకి తెస్తున్నామని ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ నవీన్ తుమ్మల తెలిపారు.

ఎక్కువ ధర పలికిన నంబర్లు
TS 09 FQ 9999 10.70 లక్షలు
TS 09 FR 0009 4.09 లక్షలు
TS 09 FR 0001 2.54 లక్షలు
TS 09 FR 0099 1.30 లక్షలు
TS 09 FR 0006 87 వేలు
TS 09 FR 0005 61వేలు
TS 09 FR 0069 60.5 వేలు
TS 09 FQ 9990 60 వేలు