ముంబై ONGC లో అగ్నిప్రమాదం..ఐదుగురు మృతి

ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నవీ ముంబై పరిధిలోని యురాన్  ONGC ప్లాంట్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇవాళ(మంగళవారం) ఉదయం ప్లాంట్ లోని  కోల్డ్ స్టోరేజీ గోడౌన్ నుంచి వచ్చిన మంటలు ఎగిసిపడుతూ.. వేగంగా ఇతర భవనాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా..8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గోడౌన్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో కోల్డ్ స్టోరేజీ గోడౌన్ లోని కోట్లాది రూపాయల విలువైన యంత్ర సామాగ్రి, ఇతర పరికరాలు, ముడి చమురు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, 50 ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు, ఆ ప్రాంతం చమురు శుద్ధి కర్మాగారం పరిధిలో ఉండటంతో, తగు జాగ్రత్తలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చాని… ఘటనపై విచారణను జరుపనున్నట్లు ONGC అధికారులు తెలిపారు.

Latest Updates