బిట్ కాయిన్, ఆన్ లైన్ స్కీంలతో నిజామాబాద్ లో భారీ మోసం

నిజామాబాద్ : బిట్ కాయిన్, ఆన్ లైన్ స్కీంలతో నిజామాబాద్ లో భారీ మోసం జరిగింది. కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. బిట్ కాయిన్ లో డబ్బులు పెట్టుబడి పెడితే… రెండింతలు ఇస్తామని మోసం చేశారని వాపోతున్నారు.

ఈ స్కీంలో సభ్యులను చేర్చితే కమీషన్ అదనంగా ఇస్తామంటూ… కొందరు ఏజెంట్లు 35 కోట్లు వసూలు చేసారని చెప్పారు. 450 మంది వ్యక్తులను సభ్యులుగా చేర్చామని.. వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని వేడుకున్నారు బాధితులు.

Latest Updates