ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేర్లతో భారీ మోసం..ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్: ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేర్లతో భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు హైదరాబాద్ పోలీసులు.  కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 850 మంది నుండి 34. కోట్లు వసూలు చేశారన్నారు. హైదరాబాద్ లో కొన్ని నెలలుగా ఇన్వెస్ట్ మెంట్ పేరుతో భారీగా మోసాలు చేస్తున్నారని.. సైబర్ క్రైమ్ పోలీసులకు 3 నెలల క్రితం  ఫిర్యాదు చేశారు బేగంపేటకు చెందిన ఖయ్యూమ్ ఖాన్ అనే వ్యక్తి. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సైబర్ పోలీసులు.. మోసాలకు పాల్పడుతున్న సైనిక్ పూర్ కి చెందిన కౌశిక్ బెనర్జి, రేఖ జాదవ్,అనే ఇద్దరిని శనివారం అరెస్టు చేశారు. తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు పోలీసులు.

Latest Updates