శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌, మస్కట్‌, సౌదీ అరేబియా నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ. 1.66 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కా సమాచారంతోనే… దుబాయ్ నుండి వచ్చిన ప్యాసింజర్ నుండి 800 గ్రాములు, మస్కట్ నుండి వచ్చిన ప్యాసింజర్ నుండి 700 గ్రాములు,సౌదీ అరేబియా నుండి వచ్చిన ఇద్దరు ప్యాసింజర్ల నుండి కేజీ న్నర బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Latest Updates