లాక్‌డౌన్ తో భారత్‌లో భారీ నష్టం: అమెజాన్

 

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ… ఇండియాలోనే తాము ఎక్కువగా నష్టపోయామని ప్రపంచ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తెలిపింది. ఈ విషయాన్ని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ శుక్రవారం తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఇండియాలో కేవలం అత్యవసర సరుకుల డెలివరీకి మాత్రమే పర్మిషన్ ఉందని… తమ నష్టాలకు ఇదే కారణమన్నారు. ఇండియాలో ఇది తమ ఒక్కరి సమస్య మాత్రమేకాదని… అన్ని సంస్థలపై ఇదే ప్రభావం ఉందని చెప్పారు. లాక్ డౌన్ పూర్తైన తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపారు.

తమ సిబ్బందికి కరోనా టెస్టులు చేయించడంతో పాటు… ఓవర్ టైమ్ చేస్తున్న వారికి తాత్కాలికంగా వేతనాలను పెంచామని బ్రయాన్ ఓస్లాస్కీ తెలిపారు.

Latest Updates