యాదాద్రి ఆలయం చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు

యాదాద్రి ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలు చెక్కడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రధాన ఆలయంపై ఈ బొమ్మలు ఉండడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  అధికార పార్టీ గుర్తుతో పాటు ఇతర చిత్రాలు చెక్కడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కొండపైన నిరసనలు వ్యక్తం చేశాయి.

దీంతో ఆలయం దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆలయాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. నిరసన కారులు కొండపైకి వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

Latest Updates