కరోనా ప్రభావం: భారీగా తగ్గిపోయిన టీటీడీ ఆదాయం

కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రపంచంలోని అన్ని మతాల పవిత్ర స్థలాలపై పడింది. దీంతో వాటి ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో ప్రతిరోజు వేలాది మందితో నిత్యం కిటకిటలాడే తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కరోనా కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. టికెట్లు, హుండి, వసతి గదులు, ప్రసాదం, తలనీలాలు, షాపులతో వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో TTD 2020-21 బడ్జెట్‌ అంచనాలు మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో భక్తులను ఎవరిని అనుమతించడంలేదు. లాక్‌డౌన్‌ మరిన్ని రోజులు ఇలాగే కొనసాగితే TTD ఆదాయం మరింత భారీగా తగ్గిపోనుందంటున్నారు ఆలయాధికారులు.

Latest Updates