కరోనా టైమ్‌‌లోనూ రికార్డుల మోత.. రెండ్రోజుల్లో 40 కోట్ల కలెక్షన్స్

చెన్నై: కరోనా టైమ్‌‌లో సినిమాలు విడుదల కావడమే పెద్ద విషయంలా మారింది. అందులోనూ 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాల్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో కలెక్షన్స్ ఎంతమేర వస్తాయనే సందేహాలు ఏర్పడ్డాయి. అయితే పొంగల్‌కు తమిళంలో విడుదలైన ఇళయదళపతి నటించిన మాస్టర్ సినిమా ఈ అనుమానాలన్నింటికీ చెక్ పెట్టింది. ఈ మూవీ రిలీజైన రెండ్రోజుల్లోనే 40 కోట్ల పైచిలుకు వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని తమిళ ట్రేడ్ అనలిస్ట్ కౌశిక్ ఎల్‌‌ఎం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తమిళనాడులో మాస్టర్ తొలిరోజు 25 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందన్నారు. రెండో రోజు కలెక్షన్స్‌ కలుపుకొని కేవలం తమిళనాడులోనే రెండ్రోజుల్లో 40 కోట్ల గ్రాస్‌‌ సాధించిందన్నారు. కరోనా టైమ్‌‌లో యాభై శాతం ఆక్యుపెన్సీతో ఇన్ని కలెక్షన్స్ కొట్టడం అంటే విశేషమే మరి. కాగా, కరోనా నేపథ్యంలో 50 శాతం సీట్ల ఆక్యుపెన్సీ నిబంధనను పాటించని థియేటర్లకు అధికారులు జరిమానాలు విధించారు.

Latest Updates