యాదాద్రి తరహాలో భద్రాద్రి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

master-plan-for-the-development-of-bhadradri

భద్రాద్రి రామాలయంపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్న నామా నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… యాదాద్రి తరహాలో రూ.100 కోట్లతో మాస్టర్‌ ప్లాన్ రూపొందిస్తున్నట్టు తెలిపారు. భద్రాద్రికి రైల్వేలైన్‌ మంజూరు కోసం కృషి చేస్తానన్నారు. ఏపీలో కలిసిన 5 పంచాయతీల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. వాటిని తిరిగి తెలంగాణలో కలిసేలా కృషి చేస్తానని నామా తెలిపారు.

Latest Updates