అమ్మబాబోయ్ :10వేల తేనెటీగలతో గర్భిణీ మహిళ ఫోటో షూట్.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఒక్క తేనెటీగ కుడితేనే కుయ్యో! మొర్రో!! అంటాం. అలాంటిది ఓ గర్భిణీ మహిళ 10వేల తేనెటీగలతో ఫోటో షూట్ చేయించుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సాధారణంగా ఫోటో షూట్ అంటే పెళ్లిళ్లకే కాదు, గర్భిణీ స్త్రీలు గర్భవతి గా ఉన్న సమయాన్ని క్యాప్చర్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అలా అమెరికా టెక్సాస్ కు చెందిన ప్రెగ్నెంట్ మహిళ బెథానీ కరులక్-బేకర్ ఫోటో షూట్ చేయించుకుంది. గర్భవతి గా ఉన్న బెథానీ తన గర్భంపై సుమారు 10వేల తేనెటీగల్ని పెట్టుకొని స్టిల్ ఇచ్చింది. ఆ స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయగా..వాటిని చూసిన నెటిజన్లు అమ్మ బాబోయ్ తేనెటీగలు అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ తేనెటీగలతో ఫోటో షూట్ వెనుక విషాదం దాగి ఉందని బెథానీ తెలిపింది. గతేడాది తనకు గర్భస్రావం అయ్యిందని, దీంతో కొన్ని నెలల పాటు డిప్రెషన్ కు గురైనట్లు తెలిపింది. ఈ సారి తనకు పుట్టబోయే బిడ్డ ధైర్యసాహాసాలకు ప్రతీకగా నిలవాలని అందుకే తాను ఈ ఫోటో షూట్ చేయించున్నట్లు తెలిపింది.

Latest Updates