భ‌విష్య‌వాణి: పాపాలు పెరిగిపోవ‌డంతోనే క‌రోనా

సికింద్రాబాద్:  పాపాలు పెరిగిపోవ‌డంతోనే క‌రోనా వ్యాపిస్తుంద‌న్నారు స్వ‌ర్ణ‌ల‌త‌. సోమ‌వారం ఉజ్జ‌యిని మ‌హంకాళి ఆల‌యంలో ప‌చ్చికుండ‌పై నిల‌బ‌డి భ‌విష్య‌వాణి వినిపించారు స్వ‌ర్ణ‌ల‌త‌. క‌రోనా వ‌ల్ల భ‌క్త‌లు లేకుండానే బోనాలు చేయ‌డం అమ్మ‌వారికి సంతోషాన్నివ్వ‌లేద‌ని చెప్పారు స్వ‌ర్ణ‌ల‌త‌. ఎవ్వ‌రు చేసుకున్న పాపం వారు అనుభ‌విస్తార‌ని.. భ‌క్తితో కొలిచేవారిని కాపాడుతాన‌న్నారు.

ముందుముందు మ‌రింత జాగ్ర‌త్త అవ‌స‌రం అని తెలిపారు. ఐదువారాలు అమ్మ‌వారికి సాక పోసి, యాగాలు, పూజ‌లతో మొక్కులు చెల్లిస్తే త‌ప్ప‌నిస‌రిగా కాపాడుతాన‌ని చెప్పారు. గంగా దేవికి యాగాలు చేస్తే శాంతిస్తుంద‌ని తెలిపారు. గ‌డ‌ప గ‌డ‌ప నుండి అమ్మ‌వారికి త‌ప్ప‌నిస‌రిగా బోనం వ‌చ్చిన‌ప్పుడే సంతోషం అవుతుంద‌ని భ‌విష్య‌వాణి వినిపించారు స్వ‌ర్ణ‌ల‌త‌.

 

Latest Updates