సబ్జెక్టుల్లో మ్యాథమేటిక్స్ చాలా కష్టం

mathematics-in-subjects-is-very-difficult

కళ్లుకళ్లూ ప్లస్సు.. వాళ్లూవీళ్లు మైనస్​ అంటూ ఓ కవి లెక్కలపై ఓ పాటనే మలిచాడు. కానీ, పాటపాడుకోవడం వరకు ఓకే.. చెయ్యడానికే కష్టమంటున్నారు మన స్టూడెంట్స్​. అవును, సబ్జెక్టుల్లో మ్యాథమేటిక్స్​ చాలా కఠినం అంటున్నారు. ఐచాంప్​ అనే లెర్నింగ్​ యాప్​ చేసిన సర్వేలో లెక్కలంటే మహా కష్టమని పిల్లలు చెప్పారట. తల్లిదండ్రులు, స్కూళ్లు లెక్కలపై పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారట. పోటీలు, రివార్డులుంటే స్టూడెంట్లు మెరుగ్గా రాణిస్తున్నారని సర్వే తేల్చింది. ఒక్కరే ఒక్క టెస్టు తీసుకునే బదులు ఇతరులతో పోటీ పడేందుకే చాలా మంది పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారట. యాప్​లో స్టిక్కర్లు, బ్యాడ్జిలను రివార్డులుగా ఇవ్వడమూ పిల్లల్లో స్ఫూర్తిని నింపుతోందని చెప్పింది. ఐచాంప్​ పెట్టిన టెస్టుల్లో హైదరాబాద్​, బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్​, ముంబై, పుణే, కోల్​కతా, చెన్నై వంటి టయర్​ 1 సిటీల్లోని విద్యార్థులు ఇంగ్లిష్​లో 15 శాతం ఎక్కువ మార్కులు సాధించారట. టయర్​ 3 సిటీల కన్నా టయర్‌ 2 నగరాల స్టూడెంట్లు మెరుగ్గానే ఉన్నా, టయర్‌ 1కన్నా తక్కువేనట.  మెట్రో నగరాల్లోని స్టూడెంట్లకు హిందీ కూడా ఓ పెద్ద సవాలేనట. 5 నుంచి 13 ఏళ్ల మధ్య స్టూడెంట్లపై సంస్థ ఈ సర్వే చేసింది.

 

Latest Updates