గ్యాంగ్‌ కాల్పుల్లో మట్కా కింగ్ జిగ్నేష్ థక్కర్ మృతి

కల్యాణ్​: ఒక గ్యాంగ్‌ జరిపిన కాల్పుల్లో మట్కా కింగ్‌గా పిలిచే జిగ్నేష్ థక్కర్‌‌ అలియాస్ మునియాతోపాటు మరో ముగ్గురు చనిపోయారు. కాల్పుల్లో గాయపడిన మునియాను ఫోర్టిస్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు మృతి చెందాడని ఆస్పత్రి డాక్టర్లు కన్ఫామ్ చేశారు. మునియా సహచరుడు ఒకరి ఫిర్యాదు మేరకు లోకల్ మహాత్మా ఫూలే పోలీసులు మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం గ్యాంగ్‌స్టర్ ధర్మేష్ అలియాస్ నన్నూ షా, అతడి అసోసియేట్ జైపాల్ అలియాస్ జపాన్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు రిజిస్టర్ చేశారు. నన్నూ షా మాజీ గ్యాంగ్‌స్టర్ అని, అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. గతంలో అండర్‌‌వరల్డ్‌ డాన్ ఛోటా రాజన్‌తో నన్నూ షాకు సంబంధాలు ఉండేవని సమాచారం.

నన్నూ షా అనుచరుడైన చేతన్ పటేల్‌తో రెండ్రోజుల క్రితం మునియాకు వివాదం ఏర్పడింది. దీంతో శుక్రవారం రాత్రి మునియా తన అనుచరులతో ఆఫీసు బయట ఉండగా నన్నూ, జైపాల్‌తోపాటు మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. మునియాకు కల్యాణ్‌, దొంబివ్లీ, ఉల్హస్‌నగర్‌‌లో మట్కా దందాతోపాటు వేరే ఇతర బిజినెస్ వ్యవహారాల్లో నన్నూ షాతో గొడవలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. వీటి వల్లే ఈ మర్డర్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Latest Updates