ఫేక్ న్యూరో సర్జన్ : పెళ్లి పేరుతో మోసం

హైదరాబాద్ : పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తను న్యూరో సర్జన్‌ ను, కెనడాలో ఉంటున్నానని అమ్మాయిలను మోసం చేస్తున్నాడు తమిళనాడు ఈరోడ్‌ కు చెందిన రవిశంకర్ పళని స్వామి(40). పలు మ్యాట్రిమోనీ సైట్లలో దరఖాస్తు చేసుకున్నాడు. పెండ్లి చూపుల పేరుతో యువతుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు తీసుకుని డబ్బులు వసూలు చేశాడు.

బాధితులు పెండ్లి చేసుకోమని చెప్పగా.. తనకు సమస్యలు ఉన్నాయని చెప్పి తప్పించుకుంటున్నాడు. మోసం చేయడమేకాకుండా వారి మొబైల్స్ కు అసభ్యకరమైన పోస్టులు పంపుతూ వేధిస్తున్నాడు. బాధితులు సరూర్‌ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates