స్విట్జర్లాండ్ మంచు పర్వతంపై మువ్వన్నెల వెలుగులు

జెనీవా: కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఇండియాకు స్విట్జర్లాండ్​ సంఘీభావం తెలిపింది. స్విస్ ఆల్ప్స్ లోని ప్రసిద్ధ మాటర్‌హార్న్ పర్వతంపై మన జాతీయ జెండాను ఆవిష్కరించింది. తద్వారా ఇండియన్స్ అందరికీ నమ్మకం, శక్తి బలోపేతం కావాలని ఆకాంక్షించింది. స్విట్జర్లాండ్,ఇటలీ దేశాల మధ్య సముద్ర మట్టానికి 4,478 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరంపై ప్రొజెక్టర్ ద్వారా స్విస్ లైట్ ఆర్టిస్ట్ జెర్రీ హాప్స్  మన జెండాను ఆవిష్కరించారు. కరోనాను ఎదుర్కోవడానికి వివిధ దేశాలకు మద్దతిస్తూ.. జెండాలు, సందేశాలను అద్భుతంగా ప్రదర్శించారు.
‘‘ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటైన ఇండియా కరోనాపై పోరాడుతోంది. ఇంత పెద్ద దేశంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇండియన్స్ అందరికీ నమ్మకం,స్థైర్యం చేకూరాని ఆశిస్తున్నాం” అంటూ ఇండియా ఫ్లాగ్​ను ఆవిష్కరించిన ఫొటోను అక్కడి టూరిజం డిపార్ట్ మెంట్ ఫేస్ బుక్​లో పోస్టు చేసింది.

మనం మహమ్మారిని కచ్చితంగా జయిస్తం: మోడీ
ప్రపంచం అంతా కరోనాపై పోరాడుతోంది. మానవత్వం ఖచ్చితంగా ఈ మహమ్మారిని అధిగమిస్తుంది”అనే క్యాప్షన్ తో ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టుకున్న ఇలాంటి కష్ట సమయంలో స్విట్జర్లాండ్ .. హోప్, లవ్, సింపతీ సందేశాలను పంచుతోందని పేర్కొన్నారు.

Latest Updates