పోలీసులను చూసి.. అండర్ వాటర్ స్కూటర్ తో నీళ్లలో దూకి జంప్..

హెలికాఫ్టర్ లో ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

క్యాలిఫోర్నియా:  పొంజీ పెట్టుబడుల అవినీతి స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ  పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న మాథ్యూ పియెర్సీ (44)  తనను వెంటాడిన ఎఫ్.బి.ఐ ఏజెంట్ల నుండి తప్పించుకునేందుకు చివరి వరకు విఫలయత్నం చేశాడు. జెమ్స్ బాండ్ లా అండర్ వాటర్ స్కూటర్ తో క్యాలిఫోర్నియా నదిలోకి దూకిన మాథ్యూ పియెర్సీని ఎఫ్.బి.ఐ ఏజెంట్లు సినీ ఫక్కీలో పట్టుకుని కటకటాల వెనక్కు పంపారు. క్యాలిఫోర్నియాలో జరిగిన ఘటన సంచలనం రేపింది. అండర్ వాటర్ స్కూటర్ తో  నదిలోకి దూకిన  మాథ్యూ  130 అడుగుల లోతుకు వెళ్లి  అరగంట సేపు  ప్రయాణించాడు. అతన్ని వెంటాడుతూ ఎప్ బీఐ ఏజెంట్లు  నదిపైన హెలికాప్టర్ తో గాలించారు. చాలాసేపు మాథ్యూ పియెర్సీ నదిలో ఎటువైపు వెళ్తున్నది చాలాసేపు అర్థం కాలేదు.

చివరకు అండర్ వాటర్ స్కూటర్ ప్రయాణిస్తున్న మార్గంలో ఆక్సిజన్ నీటి బుడగలు వస్తుండడం గుర్తించి  ఎఫ్.బీ.ఐ ఏజెంట్లు వెంబడించారు. సరస్సు నీళ్లు చాలా చల్లగా ఉండడంతో 25 నిమిషాలకే మాథ్యూ  పైకి రావాల్సి వచ్చింది. అంతేకాదు ఆక్సిజన్ ట్యాంక్ అయిపోవస్తుండడంతో మ్యాథ్యూ కు నదిపైకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. పైకి వచ్చిన వెంటనే ఎఫ్.బీ.ఐ ఏజెంట్లు వెల్కమ్ చెప్పడంతో ఖంగుతిని చేతులెత్తేశాడు. చలికి తట్టుకోలేకపోతున్నానని చెప్పడంతొ పొడిబట్టలు వేసుకున్న తర్వాత తమ వెంట తీసుకెళ్లారు ఎఫ్.బీ.ఐ ఏజెంట్లు. మాథ్యూ పియెర్సీ 35 మిలియన్ డాలర్ల పెట్టుబడుల అవినీతికేసులో నిందితుడుగా ఉన్నాడు. వైర్ మోసం, మెయిల్ మోసం, మనీలాండరింగ్,  సాక్షాల ట్యాంపరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్

హోం ఐసొలేషన్ లో సల్మాన్ ఖాన్ 

Latest Updates