మోడీ పాలన బీజేపీకి ఓ మాయని మచ్చ: మాయావతి

ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. తనకంటే ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన అనుభవం మోడీకి ఉన్నా.. ఆయన పాలన గుజరాత్ లో  బీజేపీకి మాయని మచ్చ తెచ్చిందన్నారు.  ఉత్తరప్రదేశ్ లో తాను ముఖ్యమంత్రిగా పనిచేసినంత కాలం మత విద్వేషాలు, అల్లర్లు,అరాచకాలకు తావు లేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ కంటే బీఎస్పీనే ముందంజలో ఉందన్నారు మాయావతి. మోడీ పేపర్ పైనే ఓబీసీ అని..ఆయన అవినీతి రహితుడన్నది కూడా పేపర్ కే పరిమితమని విమర్శించారు.

Latest Updates