కేసీఆర్ కు మాయావతి మద్దతు ఇవ్వరు: జగ్గారెడ్డి

దళిత వ్యతిరేకి అయిన కేసీఆర్ కు బీఎస్పీ అధినేత్రి మాయవతి మద్దతు ఇవ్వరన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సిద్ధాంతాలు వేరు కావడంతో టీఆర్ఎస్ కు శివసేన కూడా మద్దతు పలకదన్నారు. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలనే కల శరద్ పవార్, మాయావతిలకే నెరవేరలేదని… కేసీఆర్ దాని గురించి ఆలోచించకపోవడమే మంచిదని చెప్పారు. కేసీఆర్ ను.. ఆయన మాటలు నమ్మదగినవి కావన్నారు.

అంతేకాదు ప్రాంతీయ పార్టీని నడపడం, జాతీయ పార్టీని నడపడం రెండూ వేరన్నారు జగ్గారెడ్డి. ఎప్పుడూ నాలుగు గోడల మధ్య కూర్చొనే నాయకుడు జాతీయ పార్టీని నడపలేడని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని పెడితే నవ్వులపాలు అవుతారని చెప్పారు. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు.

Latest Updates