యూపీ మాజీ సీఎం మాయావతి ఇంటికి కరెంట్ కట్

బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతికి  విద్యుత్ శాఖ అధికారులు షాకిచ్చారు. విద్యుత్ బిల్లులు చెల్లించనందుకు గ్రేటర్ నొయిడాలోని ఆమె ఇంటికి ఇవాళ(బుధవారం) కరెంట్ సరఫరాను నిలిపేశారు. మాయావతి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.67వేల వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు.

అయితే ఆమె ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేయడంలో ఎలాంటి రాజకీయాల్లేవని అధికారులు చెప్పారు. కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించనివారికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం సాధారణమన్నారు. కరెంట్ సరఫరా నిలిపేయడంతో… ఆ బాధలను తట్టుకోలేక మాయావతి కుటుంబ సభ్యులు యాబైవేల రూపాయలు బిల్లు కట్టడంతో అధికారులు కరెంట్ కనెన్షన్ ఇచ్చారు.

Latest Updates