MBBS సీట్ల ఎంపికలో గందరగోళం

MBBS లో సీట్ల ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేషనల్ ఎలిజబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో సున్నా, నెగెటీవ్‌ మార్కులు వచ్చినా 400 మందికి MBBS సీట్లు రావడం ఆందరిని ఆశ్చర్యానికి గురుచేస్తోంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో జిరో మార్కులు వచ్చినా MBBS కాలేజిల్లో అడ్మిషన్‌ లభించడం గమనార్హం.
నీట్‌ లో పాస్ అయిన 1990 మందికి 2017లో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ లభించింది. వీరిలో 530 మందికి ఫిజిక్స్, కెమెస్ట్రీ, రెండింటిలో కలిపి సింగిల్ డిజిట్, సున్న, నెగిటివ్ మార్కులు మాత్రమే వచ్చాయి. వీరిలో 507 మంది ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందారు.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర సబ్జెక్టులకు నీట్‌ లో ప్రత్యేకంగా కటాఫ్ లేదు. ఒక్కో పేపర్‌ లో కనీసం ఇన్ని మార్కులు రావాలన్న రూల్ కూడా లేదు. దీంతో చాలా మందికి జీరో మార్కులు వచ్చినా సీటు లభించింది. గతంతో ప్రతి సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు రావాలనే రూల్ ఉండేది. అయితే ఫిబ్రవరి 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI ) ఈ రూల్స్ ను మారుస్తూ ..మొత్తం 50 శాతం వస్తే సరిపోతుందని నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రస్తుతం నీట్‌ ను CBSE నిర్వహిస్తోంది. ఇకపై వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్‌), JEE(మెయిన్స్‌), జాతీయ అర్హత పరీక్ష(నెట్‌) లాంటి పరీక్షలను ఇకపై CBSEకి బదులుగా, కొత్తగా ఏర్పాటైన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) నిర్వహిస్తుందని HRD మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ వెల్లడించారు. నీట్‌ ను ఫిబ్రవరి, మే నెలల్లో JEE –మెయిన్స్‌ ను జనవరి, ఏప్రిల్‌ నెలల్లో నిర్వహిస్తారు.

Posted in Uncategorized

Latest Updates