MBBS, BDS ప్రవేశాలకు నోటిఫికేషన్

kalojiuniversityకాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో MBBS, BDS కోర్సుల ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు కాళోజి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. కరుణాకర్ రెడ్డి , రిజిస్ట్రార్ డా. ప్రవీణ్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2018లో అర్హత సాధించిన అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.in లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 8 గంటల నుండి 26వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత… ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ ను లాగిన్ కావాలని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates