ఎంబీబీఎస్ ఫీజుల పెంపు? కన్వీనర్​ సీటుకే రూ.లక్ష అయితే… మరి మేనేజ్‌మెంట్ సీటుకు?

ఎంబీబీఎస్ ఫీజుల పెంపు?

కన్వీనర్​ కోటా సీటు రూ.లక్ష

మేనేజ్​మెంట్​ కోటా సీటు రూ.14 లక్షలు!

ఫీజుల పెంపుపై ఆఫీసర్ల కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డాక్టర్​ చదువులు  మరింత ఖరీదయ్యే అవకాశాలు ఉన్నాయి.  ప్రతి మూడేండ్లకు  ఒకసారి ఫీజులపై రివ్యూ చేయాల్సి ఉన్నందున ఫీజుల పెంపుపై ఆఫీసర్లు కసరత్తు స్టార్ట్​ చేశారు. ప్రస్తుతం కన్వీనర్ కోటా సీటు ఫీజు రూ. 60 వేలు ఉండగా, మేనేజ్‌‌మెంట్ కోటా సీటు ఫీజు రూ. 11.5 లక్షలు ఉంది. ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ కోటా సీటుకు ఫీజును  మేనేజ్‌‌మెంట్‌‌ ఫీజుకు డబుల్ వసూలు చేసుకోవచ్చు. చివరిగా 2017లో ఫీజుల పెంపు చేపట్టారు. 3 ఏండ్ల నిబంధన ప్రకారం ఈ ఏడాది ఫీజులు పెంచాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాయి. అయితే..  కరోనా ఎఫెక్ట్‌‌తో చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇలాంటి టైంలో  ఫీజుల పెంపు సరికాదని స్టూడెంట్ల తల్లిదండ్రులు అంటున్నారు.

ఫీజుల పెంపు ఇట్ల ఉండొచ్చు..!

ప్రస్తుతం మన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి 4,965 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,615 సీట్లు ఉండగా.. ప్రైవేట్ కాలేజీల్లో 3,200 సీట్లు ఉన్నాయి. బీబీనగర్ ఎయిమ్స్‌‌లో 50, సనత్ నగర్ ఈఎస్‌‌ఐసీలో మరో వంద సీట్లు ఉన్నాయి. ఈ అకడమిక్ ఇయర్‌‌‌‌లో ఎంబీబీఎస్‌‌ క్లాసులు  ప్రారంభించేందుకు 150 సీట్లతో ఓ ప్రైవేటు కాలేజీకి ఇటీవలే పర్మిషన్ వచ్చింది. మరో 2 ప్రైవేట్ కాలేజీలకూ పర్మిషన్ వచ్చే చాన్స్​ ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్ ఆఫీసర్లు చెప్పారు. మొత్తం సీట్ల సంఖ్య 5,400 వరకూ పెరిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ కాలేజీల్లో సీటు వచ్చిన స్టూడెంట్లకు  ఏడాదికి రూ. 10 వేల ఫీజు మాత్రమే ఉంటుంది. ఒకవేళ పెరిగినా మరో రూ. పది వేలకు మించి ఉండదు.  ప్రైవేట్ కాలేజీల్లోని సగం సీట్లను కన్వీనర్ కోటాలో, 35% సీట్లను మేనేజ్‌‌మెంట్ కోటాలో, 15% సీట్లను ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ కోటాలో భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా రూ. 80 వేల నుంచి రూ.లక్ష వరకూ పెరగొచ్చని ఆఫీసర్లు చెప్తున్నారు. మేనేజ్‌‌మెంట్ కోటా సీటు రూ. 13 లక్షల నుంచి 14 లక్షల వరకూ పెరగొచ్చని ప్రైవేట్​ కాలేజీలు చెబుతున్నాయి.

For More News..

కల్వకుర్తి ఘటనపై ముందే హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం

‘ధరణి’లో వ్యవసాయేతర ఆస్తులను ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు

డబ్బు పంచకుండా గెలవగలవా? సీఎం కేసీఆర్‌కు వివేక్ సవాల్

Latest Updates