విదేశాల్లో చిక్కుకున్న ఇండియ‌న్స్ ని వెన‌క్కి తీసుకొస్తాం

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్ర‌పంచమంతా వ్యాపించిన క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. కొన్ని దేశాలు స‌డ‌న్ గా అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను నిలిపేశాయి. దీంతో ఎక్క‌డి వారు అక్క‌డ నిలిచిపోయారు. మ‌న దేశంలో ఉండిపోయిన విదేశీయుల‌ను ఇప్ప‌టికే కొన్ని దేశాలు స్పెష‌ల్ ఫ్లైట్స్ లో తీసుకెళ్లాయి. ఇప్పుడు భార‌త్ కూడా ఇదే ప‌ని చేసేందుకు సిద్ధ‌మైంది.

కేంద్ర కేబినెట్ సెక్రెట‌రీ రివ్యూ

అమెరికా, దుబాయ్, ప‌లు యూర‌ప్, గ‌ల్ఫ్ దేశాల్లో భార‌తీయులు భారీ సంఖ్య‌లో చిక్కుకుని ఉన్నార‌ని, వారిని భార‌త్ కు తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలిపారు కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబ. అయితే అంత‌కంటే ముందు విదేశాల నుంచి వ‌చ్చే పౌరుల‌ను క్వారంటైన్ చేయ‌డం, అవ‌స‌ర‌మైన వైద్య స‌హాయం అందించ‌డం వంటివి చేసేందుకు రాష్ట్రాల సంసిద్ధ‌త‌ను తెలుసుకోవాల్సి ఉంద‌న్నారు. దీనికి సంబంధించి విదేశాంగ శాఖ అన్ని రాష్ట్రాల‌తో క‌న్స‌ల్టేష‌న్ మొద‌లుపెట్టింద‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి ఫీడ్ బ్యాక్ అంద‌గానే విదేశాంగ శాఖ మ‌న వాళ్ల‌ను తీసుకొచ్చేందుకు విదేశాల‌తో మాట్లాడుతుంద‌ని చెప్పారు.

శ‌నివారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెట‌రీల‌‌తో కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబ వీడియో కాన్ఫ‌రెన్స్ స‌మీక్ష‌ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న తీరు, ఆంక్ష‌ల స‌డ‌లింపుపై కేంద్రం ఇచ్చిన గౌడ్ లైన్స్ గురించి చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా విదేశాల నుంచి మ‌న వాళ్ల‌ను వెన‌క్కి తీసుకురావాల‌న్న ప్ర‌తిపాద‌నను ప్ర‌స్తావించారు. అన్ని రాష్ట్రాల సంసిద్ధ‌త గురించి వివ‌రాలు కోరారు.

Latest Updates