వరద నీటిలో మేడారం.. జంపన్న వాగు పొంగడం చరిత్రలో ఇదే మొదటిసారి

ములుగు: నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల‌కు ములుగు జిల్లా జంప‌న్న వాగు పొంగి పొర్లుతుంది. మేడారం గ్రామం పూర్తిగా జంపన్న వాగులో ఉండిపోయింది. చరిత్రలో మొట్టమొదటి సారిగా వర్షపు నీరు గ్రామన్నే చుట్టేసింది. మేడారం గ్రామ బ్రిడ్జీపై నుండి వరద నీరు గ్రామంలోకి చేరుతున్న‌ది . ప్రస్తుతం మేడారం గద్దెల సమీపంలోని ఐటిడీఏ కార్యాలయానికి జంపన్న వాగు నీరు తాకింది. ఇప్పటికే చిలుకల గుట్టను తాకి గద్దెలవైపుగా పయనిస్తున్న వర‌ద‌.. మరి కాసేపట్లో మేడారం అమ్మవార్ల గద్దెలను తాక‌నున్నది. ఆ ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అవ‌డంతో ఇప్పటికే అక్క‌డ‌ జనజీవనం పూర్తిగా స్తంబించి పోయింది. పోలీసులు పస్రా నుండి మేడారం కు రవాణా సౌకర్యాలను పూర్తిగా నిలిపివేశారు. ఊరట్టం వద్ద జంపన్న వాగు నీరు…భారీగా వెళుతున్న‌ది.

Latest Updates