ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌పై వైద్య సిబ్బంది ప్ర‌మాణం

రంగారెడ్డి జిల్లా: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ దామోదర్ ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుందామ‌ని.. డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది ప్రమాణం చేశారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాలలు, గ్రామాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే స్టేషన్ లు, బస్ స్టాండ్ లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త ఎక్కడ వేయకూడదని ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లోనే చెత్తను వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలను ప్రజలందరూ పాటించాల‌న్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అసలే వర్షాలకాలం కాబట్టి ప్రజలు నివసించే పరిసర ప్రాంతాల్లో ఈగలు, దోమలు,బెడద లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates