నచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..

ఎంబీబీఎస్ సీటు రాక..  బీడీఎస్ చదవలేక..

యువతి సూసైడ్

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ సీటు రాలేదని, బీడీఎస్ చదవడం ఇష్టం లేక మనస్తాపం చెందిన యువతి సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని అలేఖ్య టవర్ 14వ అంతస్తులో నివసించే రఘురాం, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు సాహితీ(25) కోఠిలోని ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో బీడీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. ఆమె కొంత కాలంగా ఎంబీబీఎస్ సీటు రాలేదని, బీడీఎస్ కు పెద్దగా డిమాండ్ లేదని బాధపడుతున్నట్లు తెలిసింది. లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న కుటుంబసభ్యులు తరచూ దీని గురించే చర్చించుకునే వారని తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన సాహితీ మంగళవారం మధ్యాహ్నం బాల్కనీలోని గ్రిల్స్ ను తొలగించి, కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎల్బీనగర్ డీఐ కృష్ణమోహన్, ఎస్సై సుధాకర్ స్పాట్ కు వచ్చి పరిశీలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

వీ6 చొరవతో సొంతూరికి తల్లీకూతుళ్లు

భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

Latest Updates