రేపటి నుంచి SI అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌లు

ఈ నెల 25, 26 తేదీల్లో ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఏర్పాట్లు చేపట్టింది. ప్రస్తుతం పోస్టులకు ఎంపికైనవారి ఫొటోలు, సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. తర్వాత మెడికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌తోపాటు పాత పది జిల్లాకేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. తుది రాతపరీక్షకు హాజరైన సమయంలో అభ్యర్థుల నుంచి సేకరించిన వేలిముద్రలను.. మెడికల్ టెస్ట్‌లకు వెళ్లేముందు సరిపోల్చనున్నారు.

Latest Updates