ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకోవాలి

సైబర్ క్రైమ్ పోలీసులకు ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి మీరా చోప్రా

ట్వీట్టర్‌లో తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు బాలీవుడ్ నటి మీరా చోప్రా ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌ను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్‌కు కూడా ట్యాగ్ చేశారు. మీరా చోప్రా ట్వీట్స్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 67 ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల‌ కింద కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ ఏసీపీ కె.వీ.ఎం. ప్రసాద్ తెలిపారు. మీరా చోప్రా గురించి అసభ్యంగా కామెంట్స్ చేసిన వారి ట్విట్టర్ అకౌంట్స్ గుర్తిస్తున్నామని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యంగా ఉన్న పోస్టులను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసినా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

For More News..

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు ఓవర్ స్పీడ్ ఫైన్

ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోతే.. రేప్ చేస్తారా?

ఈజీగా కొత్త అప్పులిస్తున్నస్టేట్​ బ్యాంక్​

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు

Latest Updates