మీర్ పేట్ మిథిలానగర్ లో ఇళ్లలోకి చేరిన నీరు

హైదరాబాద్ మీర్ పేట్ కార్పొరేషన్  పరిధిలోని మిథిలానగర్ కాలనీలోకి వరద నీరు చేరింది. వరద నీటితో కాలనీలోని ఇండ్లల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా మీర్ పేట్ పరిధిలోని మంత్రాల చెరువు నుంచి వరద నీరు కాలనీల్లోకి చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ చెరువు తూము తెరవడంతో భారీ వరద వస్తోంది. నీళ్లన్నీ ఇండ్లలోకి చేరాయి. వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు కాలనీవాసులు.

Latest Updates