ప్లే స్కూల్ స్టుడెంట్ ను కొట్టిన టీచర్… విరిగిన చేయి

ప్లే స్కూల్ లో చదువుకుంటున్న ఓ స్టుడెంట్ ను టీచర్ కొట్టగా ఆ పిల్లాడి చేయి విరిగింది. ఈ ఘటన హైదరాబాద్ లోని మీర్ పేట్ లో జరిగింది. మీర్ పేట్ సత్యం టెక్నో ప్లే స్కూల్ లో మూడవ తరగతి చదువుకుంటున్న సాయితేజ అనే స్టుడెంట్ ను టీచర్ సుజాత స్కేల్ తో కొట్టింది. దీంతో సాయితేజ ఎడమ చేయి విరిగింది. విషయం తెలుసుకున్న సాయితేజ తల్లిదండ్రులు స్కూల్ వచ్చి యాజమాన్యాన్ని కలువడానికి చూశారు. అప్పటికే యజమాన్యం అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో… స్కూల్ ప్రిన్సిపల్, టీచర్ పై మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates