మత్తు ఇంజక్షన్ ఇచ్చి మహిళపై అత్యాచారం చేసిన డాక్టర్లు

మీరట్‌: డాక్టర్లను వైద్యో నారాయణీ హరి అంటారు. కానీ.. ముగ్గురు డాక్టర్లు మృగంలా ప్రవర్తించారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్లర్లే పేషంట్ పై అత్యాచారం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ICUలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన ఆదివారం యూపీలోని మీరట్ లో జరిగింది.  అనారోగ్యంతో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేరింది ఓ మహిళ. ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని హస్పిటల్ లోని ICU కు మార్చారు.

ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆమెకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అత్యాచారం చేశారు. మహిళ ‘శ్వాసకోస సమస్యతో హస్పిటల్ లో చేరిందని తెలిపారు ఆమె ఫ్యామిలీ మెంబర్ప్.  ఈ కేసులో నలుగురు వ్యక్తులతో పాటు, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు మీరట్‌ పోలీసులు.  అత్యాచార సమయంలో అక్కడి సీసీటీవీలను నిలిపివేశారని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తెలిపారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Latest Updates