13నుంచి 16వ తేదీ వరకు మీ-సేవ సెంటర్లు బంద్‌

రేపటి నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు పనిచేయవు. మీ-సేవా డేటాబేస్‌ కార్యకలాపాలను మెరుగుపర్చనున్న కారణంగా రేపు(శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు ఈనెల 16వ తేదీ వరకు బంద్‌ చేయనున్నట్టు మీ-సేవా కమిషనర్‌ ప్రకటించారు. శుక్రవారం రాత్రి 7గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకూ మీ-సేవా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు చెప్పారు. తిరిగి ఈనెల 16వ తేదీ ఉదయం 8గంటల నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

Latest Updates