నాకు పెయింటింగ్ వేస్తేనే కిక్ : తన కాళ్లతో అద్భుతమైన కళాఖండాల్ని తీర్చిదిద్దుతున్న ఎలుక

నచ్చిన పని చేస్తూ అందులో ఆనందం వెతుక్కుంటుందో ఎలుక. సాధారణంగా ఎలుకలు ఏం చేస్తాయి చెప్పండి. ఇంట్లో అయితే స్టోర్ రూముల్లో, వంటగదుల్లో రాత్రి సమయంలో కీచుకీచు శబ్ధాలు చేసుకుంటూ నానా హంగామా చేస్తాయి. కానీ ఓ ఎలుక మాత్రం పెయింట్ తో అద్భుతాలు చేస్తుంది. కేవలం తన కాళ్లని కుంచగా మార్చుకొని అద్భుతమైన కళాఖండాల్ని తీర్చిదిద్దుతుంది.

మాంచెస్టర్ కు చెందిన జెస్ అనే యువతికి ఎలుకలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఓ ఎలుకను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చి పెట్టుకుంది. అంతే కాదండోయ్ దాని గుస్ అని పేరు పెట్టింది. చిట్టెలుక గుస్ ఇంట్లో తిరుగుతూ సందడి చేస్తుంటే యువతి జెస్ తెగ సంబరపడిపోయే ది. అయితే ఓ రోజు ఆ చిట్టెలుక నేల మీదున్న పెయింటింగ్  బోర్డ్ పై తన కాళ్లతో అటూ ఇటూ కదుపుతూ కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన జెస్..మరుసటి రోజు అదే బోర్డ్ పై కూర్చో బెట్టి అన్నం తినిపించేది. అన్నం తినే సమయంలో చిట్టెలుక తన కాళ్లతో డ్రాయింగ్స్ గీసేది. ఆ ఎలుకకు బొమ్మలు గీయడం ఇష్టమేమోనని భావించిన యువతి డ్రాయింగ్ బ్రెష్ లను కొనుగోలు చేసి ఎలుకకు ఇచ్చింది. దీంతో  ప్రతీ రోజూ ఆ ఎలుక డ్రాయింగ్స్ గీయడం మొదలు పెట్టింది. అలా కొద్దిరోజులు తరువాత ఎలుక గీసిన బొమ్మలతో ఎగ్జిబీషన్ ఏర్పాటు చేసింది.  ఎలుక డ్రాయింగ్స్ గీస్తుందని ఆశ్చర్యపోయిన ఇతర దేశాలకు చెందిన పెయింటింగ్ ప్రియులు వాటిని కొనుగోలు చేయడం ప్రారంభించారు.  ఒక్కో పెయింట్ ఖరీదు లక్ష పైమాటే. తాజాగా ఆ ఎలుక వేసిన పెయింటింగ్ ను ఆస్ట్రేలియాకు చెందిన ఔత్సాహికుడు 92వేలు పెట్టి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ పెయింటింగ్  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

This Rat has some serious skills! 🎨

This Rat has some serious skills! 🎨https://www.real-fix.com/animals/this-rat-has-some-serious-skills/

Posted by real fix on Monday, May 18, 2020

Latest Updates