రేపు విపక్షాల సమావేశం

meeting-of-the-opposition-parties-tomorrow

సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీలన్నీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించాయి. దీనికి సంబంధించి  రేపు(మే-31)న పార్టీలన్నీ పార్లమెంటు హాలులో సమావేశం కానున్నాయి. ఈ భేటికి కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వం వహించనుంది. ఇప్పటికే ఎవరికివారు ఓటమికి గల కారణాలను అంతర్గతంగా విశ్లేషించుకున్నాయి. ఓటమిపై ఈ సారి ఉమ్మడిగా చర్చించనున్నాయి. ఫలితాల తర్వాత ప్రతిపక్షాలు భేటి కావడం ఇదే మొదటి సారి.

జూన్‌ 6న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయన్న వార్తలతో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోఢీ  ప్రమాణ స్వీకారం చేయనున్న మరుసటి రోజే ఈ భేటీ జరగనుండడం చర్చనీయాంశంగా మారింది.

Latest Updates