హైదరాబాద్ లో పార్లమెంటరీ పట్టణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీలో సభ్యుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద.. ఎన్ని ఇళ్లు కట్టారని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఖర్చులో.. ఒక్కో ఇంటికి కేంద్రం వాటా లక్షన్నర రూపాయలు ఇస్తోందని.. ప్రధాని ఫొటో ఎందుకు పెట్టడం లేదని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇళ్ల నిర్మాణం ఇంత ఆలస్యంగా ఉంటే.. 2022వరకు దేశంలో అందరికి సొంత ఇల్లు ఉండాలన్న ప్రధానమంత్రి ఆశయం ఎలా నేరవేరుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వరంగల్, కరీంనగర్ పట్టణాలను స్మార్ట్ సిటీగా కేంద్రం ప్రకటించిందని.. వాటికోసం 196 కోట్లను కేటాయించిందని కమిటీ తెలిపింది. అయితే స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేసి మ్యాచింగ్ గ్రాంట్ ను ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
see more news