ఘనంగా మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం

మెగా ఫ్యామిలీలో శుభకార్యం జరిగింది. నాగబాబు కుమార్తె నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం హైదరాబాదులో ఘనంగా జరిగింది. చైతన్య గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్ రావు తనయుడు. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా అతి తక్కువ మంది అథితులు మాత్రమే హాజరయ్యారు. మెగా కుటుంబ సభ్యులతో పాటు..చైతన్య కుటుంబానికి చెందిన  కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. తాంబూలాలు మార్చుకోవడంతో ఇక పెళ్లి చేసుకోవడమే మిగిలింది. కాగా, నిశ్చితార్థ వేడుకలో నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ తదితరులు సందడి చేశారు.

Latest Updates