మెగా జాబ్ మేళా : 60 కంపెనీలు..8వేల జాబ్స్

హైదరాబాద్ :నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు నార్త్ జోన్ పోలీసులు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖా-TMI  గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24న  ఉచిత ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ శ్రీ. కల్మేశ్వర్ శింగనవర్ తెలిపారు. జాబ్ మేళ సికింద్రాబాద్ లోని SVIT కాలేజీలో నిర్వహించబడుతుందని తెలిపారు. సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.

జాబ్ మేళాలో నిరుద్యోగుల నుండి ఏవిధమైన ఫీజులు కానీ .. సర్వీస్ చార్జెస్ గాని తీసుకొనబడవని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు పోలీసులు. జాబ్ మేళాలో 60కి పైగా కంపెనీలు, 8వేలకు పైగా జాబ్స్ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

 

Latest Updates